పర్వతగిరి లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంపర్వతగిరి లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

పర్వతగిరి లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

పర్వతగిరి లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

చిన్నార్లకు పోలియో చుక్కలు వేసిన తహసీల్దార్ టి.వెంకటస్వామి భవిష్యత్తు తరాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పర్వతగిరి మండల తహసీల్దార్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మార్వో వెంకటస్వామి, డిప్యూటీ తహసిల్దార్, మరియు మాజీ ఎంపీటీసీ బోట్ల ఉపేంద్ర లతో కలిసి చిన్నార్లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసు గల ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. మండలంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా ఉండిపోకూడదనే లక్ష్యంతో వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలిపారు.మాజీ ఎంపీటీసీ బోట్ల ఉపేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వాలు చేపడుతున్న ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, జిఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు బూత్‌ల వద్ద చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ సేవలందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,వైద్య సిబ్బంది, మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *