
ఈ69న్యూస్ నర్సంపేట, ఆగస్టు 7
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయన భార్య స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, చిన్న వయసులోనే తమ్ముడు లాంటి నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కడియం శ్రీహరి, కుటుంబ సభ్యులు ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొంటూ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.