పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలిపోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

నిండు జీవితానికి రెండు చుక్కలు వేసి చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించడంలో ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని నారాయణగిరి గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి అన్నారు.ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి పాల్గొని ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.పోలియో నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా మిగలకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *