మారుతి మిత్ర కార్ల షోరూం కార్మికు ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం మారుతి మిత్ర కార్ల షోరూం కార్మికు ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండిసిఐటియూ.

మారుతి మిత్ర కార్ల షోరూం కార్మికు ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం

ఖమ్మం,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని విద్యుత్ ప్రవేటికలను నిలుపుదల చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని పథకాన్ని మార్చి ఆ పథకం స్థానంలో విబిజి రామ్ జి పేరుతో కొత్తగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా చేసేటువంటి దుర్మార్గమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు మరియు జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ మోహన్ రావు పిలుపునిచ్చారు.
ఖమ్మం రూరల్ మండలంలో పెద్ద తండాలోని మారుతి మిత్ర కార్ల షోరూం కార్మికు ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం గురువారం రోజు షోరూం దగ్గర నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి దేశంలో ఉన్న ప్రజానీకానికి అన్యాయాన్ని చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మెలోకి రావాలని పిలుపునిచ్చారు.
గురువారం రోజు ఖమ్మం రూరల్ మండలంలో బిల్లింగ్ వర్కర్స్ ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం వర్కర్లు హమాలీలు రంగాలలో విస్తృతంగా ఉన్న ప్రచారాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో శ్రీనివాసరావు వీరబాబు రఘు వెంకటేశ్వర్లు రామకృష్ణ నరేష్ వెంకన్న వెంకట పాష ప్రకాష్ ప్రవీణ్ వెంకట్ లక్ష్మి రజిత అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *