మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శమృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ23 August, 2026E69NEWS

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు విస్నూర్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు

విస్నూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాలగాని యాకన్న గారి తండ్రి మృతి చెందడంతో, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అదేవిధంగా బాలగాని ప్రకాష్ గారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, చాకలి ఐలమ్మ చైర్‌పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, ఆత్మ చైర్మన్ ఎర్రబెల్లి రామారావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కారుపోతుల శీను, మాజీ దేవస్థానం చైర్మన్ చెలివేరు కృష్ణమూర్తి, ex mpp గడ్డం యాక సోమయ్య జిల్లా నాయకులు ఎండి మదర్, అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు గాదేపాక భాస్కర్, బైకని ఇలేష్, లావుడియా భాస్కర్ నాయక్, ఎండి సలీం, సర్పంచ్ లావుడియా బాలాజీ కుమార్ తదితర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టసమయంలో వారికి ధైర్యం కల్పించేందుకు నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని నాయకులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *