సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
మే 1వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు సంఘటిత, అసంఘటిత రంగాలలో కనీస వేతనాలు, పని భద్రత లేకుండా శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యజమానులు అదనపు గంటలు పని చేయించుకుంటూ కార్మికులను పేదరికంలోకి నెట్టేస్తున్నారని, దీనివల్ల కార్మిక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని విమర్శించారు.’పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే నినాదంతో కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యమవ్వాలని ఆయన కోరారు.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని దినాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులు అంటే కేవలం బానిసలు కాదని, దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్,ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్, నాయకులు బంధు కాంతి,సుజాత, ఆత్కూరి శ్రీకాంత్,ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.