రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలి
సోషల్ మీడియాలో యువత,మార్క్ కనిపించాలి
పర్వతగిరి మండల బీ.ఆర్.ఎస్ సోషల్ మీడియా నాయకుడు చిన్నపెల్లి అజయ్ యువతే దేశానికి నిజమైన భవిష్యత్తు
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగితే కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు వస్తాయని
పర్వతగిరి మండల బీ.ఆర్.ఎస్ సోషల్ మీడియా నాయకుడు చిన్నపెల్లి అజయ్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని పరిష్కారానికి కృషి చేయాలని,కుల,మత,ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రజాసేవను లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతతో రాజకీయాల్లో ముందుకు సాగాలి అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడే నాయకత్వాన్ని అందించాలన్నారు.
గ్రామం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పేదలు, రైతులు,యువత, మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
సోషల్ మీడియాను ప్రజా చైతన్యం కోసం బాధ్యతాయుతంగా వినియోగించాలి ,
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు.
యువ నాయకత్వం బలపడితే దేశ రాజకీయాలకు కొత్త దిశ, కొత్త ఆశలు కలుగుతాయి.నేటి యువత రాజకీయాల్లో ముందుకు వస్తే… రేపటి భారతదేశం మరింత బలంగా, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చిన్నపెల్లి అజయ్ పేర్కొన్నారు.