E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 July, 2026E69NEWS

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ సిటీ క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు నిర్వహించిన SIR ప్రక్రియ అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మరియు పార్లమెంట్ ఇంచార్జ్ అహ్మద్ నసీర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఓటరు జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ, బీఎల్‌ఏ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అలాగే ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని, అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి పార్టీ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్న ఆయన, గ్రామ స్థాయి నుంచే ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *