రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారదరైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

వర్ధన్నపేటలో కొనుగోలు కేంద్రాల తనిఖీ

రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద

రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 8
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండలంలో మక్కలు,వడ్ల కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా సందర్శించారు.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు సూచనలు చేశారు. రైతులను అప్రమత్తం చేసి వారికి కొండంత భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం పాల్గొన్నారు.చెరువు కట్ట అభివృద్ధికి 10 కోట్లు:
అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట మైసమ్మను ప్రజలు ఘనంగా కొలిచారు.మైసమ్మ వద్ద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ…
“కొనారెడ్డి చెరువు కట్టను గత పాలించిన నాయకులు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి.గతంలో తెగిన చెరువు కట్టను తెగకుండా కాపాడాం. ఈ వర్ధన్నపేట చెరువు కట్ట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 10 కోట్లు మంజూరు చేయిస్తాం.ఈ రెండు సంవత్సరాల అభివృద్ధి,గత పది సంవత్సరాల అభివృద్ధి ప్రజలకు తెలుసు.కాంగ్రెస్ పార్టీయే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మరుపట్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *