విద్యుత్ షాక్ తో చెరువులో వ్యక్తి మృతివిద్యుత్ షాక్ తో చెరువులో వ్యక్తి మృతి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ11 March, 2026E69NEWS

విద్యుత్ షాక్ తో చెరువులో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో చెరువులో వ్యక్తి మృతి

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో మంగళవారం మధ్యాహ్నం 01:15 గంటల సమయంలో, వెలిశాల వెంకటేశ్వరరావు, రేగుల నాగేశ్వరరావు మరియు వీరవెంకి పుల్లయ్య అనే వ్యక్తులు వాసం లక్ష్మయ్యను చేపలు పడదామని కల్లూరుగూడెం సమీపంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువ వద్దకు తీసుకెళ్లారు.అక్కడ, సమీపంలోని మోటార్ బోర్డు నుండి అక్రమంగా విద్యుత్ వైర్లను కాలువలోకి లాగి, చేపలకు కరెంటు షాక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. బాధితుడు కాలువలోకి దిగుతుండగా, నిందితులు విద్యుత్ సరఫరాను ఆన్ చేయడం వల్ల, లక్ష్మయ్య విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఫిర్యాదుదారుని సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్రమ విద్యుత్ వినియోగం మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యక్తి మరణానికి కారణమైన వెలిశాల వెంకటేశ్వరరావు, రేగుల నాగేశ్వరరావు మరియు వీరవెంకి పుల్లయ్యలపై కేసు నమోదు చేశామనీ అట్టి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందనీ వేంసూరు పోలీస్ ఎస్ఐ కవిత మీడియాకు వెల్లడించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *