శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కుశ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ11 March, 2026E69NEWS

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కు

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో కార్పెంటర్ పని చేస్తూ జీవించే రాంపల్లి ఈశ్వరచారి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 25,000 రూపాయల భీమా పాలసీ తీసుకున్నారు.తీసుకున్న 09 నెలలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురి అయి మరణించారు.నామిని అయిన తన భార్య రాంపల్లి విజయకి కంపెనీ నుండి 9,10,000 రూపాయిల బీమా చెక్కును మరియు ప్రతి నెల 3,750 రూపాయలు చొప్పున 2039 వరకు పెన్షన్ మొత్తం 15 లక్షల 85 వేలు రూపాయలు చెక్కును రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ డి జి ఎం సతీష్ ,డిఎం భరత్, మేనేజర్ శ్రీనివాస్, బిడిఎం వెంకట్, సేల్స్ ఆఫీసర్ బొంతు సతీష్, సత్తుపల్లి బ్రాంచ్ ఇతర డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తమ బాధ్యతగా భావించి సరైన బీమా కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో: ఏజెంట్ లు కూరపాటి శ్రీనివాసరావు (నాని),యశోద హరిరామకృష్ణ,నడిపల్లి సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *