ఈ69 న్యూస్’ సీఈఓ డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్‌కు జాతీయ స్థాయి పురస్కారం
ఈ69 న్యూస్’ సీఈఓ డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్‌కు జాతీయ స్థాయి పురస్కారం

‘ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు-2026’ కు ఎంపిక
ఆగస్టు 13న తెలుగు యూనివర్సిటీలో పురస్కార ప్రధానం
ఈ69న్యూస్ హైదరాబాద్ ఆగస్టు 11: సామాజిక, సాంస్కృతిక రంగాలలో విశేష సేవలందిస్తూ, సమాజ పురోగతికి కృషి చేస్తున్న ‘ఈ69 న్యూస్’ సీఈఓ డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్ జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే ప్రతిష్టాత్మక “ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు – 2026” (Pride of India National Award 2026) కు ఆయన ఎంపికైనట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.మీడియా రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక విభాగాలలో ఆయన కనబరిచిన సమర్థవంతమైన నాయకత్వం, సమాజానికి చేసిన సేవలు అనేకమందికి ప్రేరణగా నిలిచాయని, దానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈనెల 13న అవార్డు ప్రదానంభారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 13న (ఆగస్టు 13, 2026) హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చిలుముల బాల్‌రెడ్డి, పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రాజా తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైన డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్‌కు పలువురు ప్రముఖులు, విలేఖరులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.