గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకంగ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామపంచాయతీలోని రైతు వేదికలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు చివరి రోజు కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ జిల్లా డిఎల్పిఓ పుల్లారావు, స్థానిక ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి పాల్గొని నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టాలపై,గ్రామపంచాయతీ వార్డు సభ్యుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి నిర్వహణ, పన్నుల వసూలు, గ్రామసభల నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులచే అవగాహన కల్పించారు.ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని అధికారులు సూచించారు. వార్డు సభ్యులు ప్రజలతో సమన్వయం పెంచుకుని గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల ప్రధానం చేశారు,ఈ కార్యక్రమంలో ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ,ట్రైనర్లు రామోజీ,ప్రణయ్,సుమన్,దేవయ్య, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,మంజుల,అరుణ్,గోపీచంద్,లక్ష్మణ్,రాజూద్దీన్,మౌనిక,రజిత,రాజు,ఆపరేటరు ఉమా మరియు ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *