తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ప్రధాన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సమర్థవంతంగా సాగుతోందన్నారు.జిల్లాలో రైతులకు రూ.299.34 కోట్ల రుణమాఫీ,రూ.144.93 కోట్ల రైతు భరోసా అందించామని తెలిపారు. పేదల సొంతింటి కల సాకారానికి 4,586 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని,మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి రూ.118.04 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని,భూ భారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు.అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులు,సిబ్బందికి ప్రశంసా పత్రాలు,లబ్ధిదారులకు సంక్షేమ ఆస్తులను పంపిణీ చేసి,వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించారు.అలాగే కలెక్టరేట్ (ఐడీఓసీ) ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించి,విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్,అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి,డీఆర్ఓ వసంత కుమారి,ఆర్డీవోలు,జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.