రాఘవపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల రాఘవపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భూమి పూజ చేశారు.విగ్రహ ప్రతిష్టాపన ప్రతినిధి సింగారపు జగన్,గుర్రపు యాదగిరి,సింగారపు ఏలియా,శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి,రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి,ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సూరారపు నిరంజన్ హాజరై అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజలో పాల్గొన్నారు.అనంతరం జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్ మాట్లాడుతూ..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనా విధానాన్ని పై ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ అణగారిన వర్గాల కోసం ఎన్నో చట్టాలను రూపొందించిన దాని అమల్లోకి తీసుకు వస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన న్ని ఆయశాలను కొనసాగించాలని కొనియాడారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి మాట్లాడుతూ..అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన కోసం గ్రామంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.