వెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదనవెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదన
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 February, 2026E69NEWS

వెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదన

వెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదన

వరంగల్ ఇంత జార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వెండి ఆభరణాల అపహరణ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. సుమారు ఐదు కిలోల వెండి ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాదుకు చెందిన పంకజ్ యాదవ్ తన వర్కర్స్ విమల్ యాదవ్, ముఖేష్ సోనీలకు వెండి ఆభరణాలు ఇచ్చి వరంగల్‌లో విక్రయించి రావాలని సూచించారు. ఈ క్రమంలో వారు 29-01-2026న హనుమకొండకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వరంగల్ వైపు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో బ్యాగులో ఉన్న వెండి ఆభరణాల గురించి మాట్లాడుకోవడం ఆటో డ్రైవర్ గమనించాడు.అదే రోజు రాత్రి సుమారు 1 గంట సమయంలో వరంగల్‌లో వారు ఆటో దిగిన వెంటనే, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే ఉంచుకుని డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం.ఏ. షుకూర్ నేతృత్వంలో ఎస్‌ఐ తేజా, పీసీలు కె. సురేష్, పి. దీపక్ సంఘటన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆటోను గుర్తించారు. నిందితుడు మెరుగు వెంకట్ (తండ్రి: నరసయ్య, నివాసం: కాశిబుగ్గ, వరంగల్)ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *