సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

పర్వతగిరి మండలం సోమారం లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల 80 శాతం మంది పిల్లలకు రెండు చుక్కల పోలియో మందు వేయడం జరిగింది.
మొత్తం గ్రామంలో ఒకటి గ్రామపంచాయతీ, రెండవది గుంటూరు పల్లి హై స్కూల్ లో పోలియో చుక్కలు వేయించారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని సోమవారం లోని గ్రామపంచాయతి వద్ద సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది మరియు వాలంటీర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు
రేపటి నుంచి జూన్ 29, 30 తేదీల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి హౌస్-టు-హౌస్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు పోలియో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు చేపడతారు. తల్లిదండ్రులు తమ 0–5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా
ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *