156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 July, 2026E69NEWS

156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు

156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలో మెడికవర్ మరియు శరత్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ప్రజ్వల్ సంస్థ పర్వతగిరి సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో గుండె పరీక్షలు- ఈసీజీ ,బీపీ,షుగర్ టెస్టులు,ఉచిత కంటి పరీక్షలు చేశారు.ముఖ్య అతిథి ప్రజ్వల్ సీఈఓ పెద్దపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ బిసిఐ కాటన్ ప్రాజెక్టులో భాగంగా రైతులు, యువకులు,మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టామని తెలిపారు.వారితో పాటు ఇన్నారెడ్డి,మేనేజర్ గడ్డిక మృదుల పాల్గొన్నారు.వైద్యులు మాట్లాడుతూ సుమారు 156 మందికి పరీక్షలు చేసి,అవసరమైన వారికి సలహాలు, మందులు అందించామని చెప్పారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలికట్టే కృష్ణవేణి,గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్లు,ఎల్ జి లీడ్ ఫార్మర్స్, బీసీఐ రైతులు,సీనియర్ సామాజిక కార్యకర్త గడ్డం యాకయ్య,సరస్వతి.తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *