భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

30వ వార్డులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తరఫున గండ్ర జ్యోతి ఇంటింటా ప్రచారం

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జక్కం రవికుమార్ గెలుపు కోసం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్రజ్యోతి గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.ప్రచారంలో భాగంగా గండ్రజ్యోతి మాట్లాడుతూ,బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల భూపాలపల్లి రూపురేఖలు పూర్తిగా మారాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఒక్కటినీ సరిగా అమలు చేయలేదని విమర్శించారు.ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.భూపాలపల్లి అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీనే ప్రజలు ఆశ్రయించాలని, అందుకు కారు గుర్తుపై ఓటు వేసి జక్కం రవికుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి జక్కం రవికుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మందల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ధరణి రమణాచారి, కాసర్ల దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ బొడ్డు సమ్మయ్య, గుర్రం సమ్మయ్య, కంకణాల సమ్మిరెడ్డి, బాబర్ భాషతో పాటు పట్టణ నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *