పోల్స్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
మైసమ్మ తల్లి పండుగకు శాశ్వత విద్యుత్
•పోల్స్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 3
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డిపేట చెరువు కట్టపై నిర్వహించే మైసమ్మ తల్లి పండుగకు శాశ్వతంగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కరెంట్ పోల్స్ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు.
పట్టణ ప్రజల విజ్ఞప్తులకు వెంటనే స్పందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన అనుమతులు తీసుకుని చెరువు కట్టపై పోల్స్ పనులను ప్రారంభించారు.కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజల సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. గతంలో ఇబ్బందులు ఎదురైన ఈ ప్రాంతంలో ఇప్పుడు శాశ్వత విద్యుత్ సౌకర్యం ఏర్పడటం ద్వారా పండుగ నిర్వహణ మరింత సులభతరం అవుతుంది అని అన్నారు.
స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,వైస్ చైర్మన్ నేతావాత్ శిభారాణి-రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నునావత్ కమ్లి-కీమానాయక్, తిరుపల్లి వాణి-కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు మైస సురేష్, పట్టణ నాయకులు ఈగ దామోదర్, మహమ్మద్ అఫ్సర్,బాబూలాల్, సుధీర్, కొండేటి సాంబయ్య, బాలకృష్ణ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి,మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పోశాల వెంకన్న,రజిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు