ఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానంఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానం

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానం

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు విరాళం అందజేసారు
•ప్రతి ఆదివారం 100 మంది భక్తులకు అన్నదానం-ఆలయ అధికారి

హన్మకొండ జిల్లా:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు,మాజీ టెస్కాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ రోజు ఎమ్మెల్యే దంపతులు అన్నదానానికి విరాళం అందజేసారు.ప్రతి ఆదివారం సుమారు 100 మంది భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. అదే రోజు ఐనవోలు గ్రామంలోని నంది సెంటర్ వద్ద ఆలయ దాతలతో ఆర్చి నిర్మాణం చేయడానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, అధ్యక్షుడు కమ్మగొని ప్రభాకర్,ధర్మకర్తల మండలి సభ్యులు,గ్రామ సర్పంచ్ గడ్డం రఘు వంశీ,ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్,ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం మధు శర్మ, పాతర్లపాటి నరేష్ శర్మ,ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, మజ్జిగ రాజయ్య మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *