రేగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మండల పరిధిలోని పాత్రికేయులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో రేగొండ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా నామాల రమేష్ (భారత శక్తి),అధ్యక్షుడిగా సుంకరి శ్రీధర్ (ఆంధ్రజ్యోతి),ప్రధాన కార్యదర్శిగా ఆకుల వెంకటేష్ (సాక్షి),కోశాధికారిగా బత్తుల ఆనంద్ (వి6 వెలుగు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షులుగా గన్రెడ్డి కరుణాకర్ రెడ్డి (తెలుగు గళం),పల్నాటి రాజు (పీపుల్స్ డైరీ),సహాయ కార్యదర్శిగా గంగిరేణి రమేష్ (ఆంధ్రప్రభ) ఎన్నిక కాగా,కార్యవర్గ సభ్యులుగా మోటం రాజు (స్పాట్ వాయిస్), గుర్రం స్వరాజ్ (సూర్య), బోయినీ రాజు (జనం సాక్షి) నియమితులయ్యారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను స్థానిక పాత్రికేయులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ… మండలంలోని జర్నలిస్టులందరి సమస్యల పరిష్కారానికి,వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ప్రెస్ క్లబ్ బలోపేతానికి,జర్నలిస్టుల ఐక్యతకు ప్రతి ఒక్కరినీ కలుపుకుని సమిష్టిగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
