ప్రజా సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్
ప్రజా సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్
ఈరోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు రెండో రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా వారిని అక్రమంగా లాఠీచార్జి చేసి అరెస్టు చేసి తానాకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని నవీపేట మండల కేంద్ర ప్రజా సంఘాల సమన్వయ కమిటీ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తుంది స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు ఎన్నికల పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు నీలకంటేశ్వరుడు స్వామి మీద ఒట్టేసి ఏడవ గ్యారెంటీ కింద ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పినా ప్రభుత్వము ఈరోజు శ్రామిక మహిళలు పైన ఉక్కు పాదం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పోలీసులను ప్రశ్నిస్తున్నాం అక్రమ అరెస్టులను లాఠీ చార్జీలను ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు వెంటనే అరెస్టు చేసిన సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను బే షరతుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలకు నిర్వహిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సిఐటియు నవీపేట మండల కమిటీ అధ్యక్షులు మేకల ఆంజనేయులు తెలంగాణ రైతు సంఘం మండల సలహాదారు జి కిషన్ సహాయ కార్యదర్శి మంత గంగాధర్ పాల్గొన్నారు