కొత్తపల్లి గోరిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
కొత్తపల్లి గోరిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

కొత్తపల్లి గోరిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ ప్రాంగణాల్లో అధికారులు,సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎన్.హేమ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.ఎందరో అమరవీరుల త్యాగఫలితంగానే నేడు దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గుర్తుచేశారు.మహనీయుల ఆదర్శాలను భావితరాలకు అందిస్తూ,దేశ ఐక్యత,సమగ్రత,అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ బి.శ్రీలత, సీనియర్ సహాయకులు కె.జ్యోత్స్న,అడిషనల్ గిర్దావర్ సి.హెచ్.రాజ్యలక్ష్మి,జూనియర్ సహాయకులు పి.రాజయ్య,ఎన్.వెంకటేష్,జి.అరవింద్,వి.శ్వేత,ఎం.జ్యోతి,గ్రామ పాలనా అధికారులు సి.హెచ్.రమేష్,కె.అమరేందర్ రెడ్డి,బి.రవీందర్,జి.సురేష్,సి.హెచ్.సంపత్,బి.భిక్షపతి,రికార్డు అసిస్టెంట్ బి.ప్రేమలత,సిబ్బంది త్రివేణి, సరిత,రైతులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ముఖ్య ఉద్దేశమని,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని,యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.