కోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర హుండీ లెక్కింపుకోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర హుండీ లెక్కింపు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 March, 2026E69NEWS

కోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర హుండీ లెక్కింపు

కోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర హుండీ లెక్కింపు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్. మహేష్ తెలిపారు.స్వామివారికి సమర్పించిన హుండీలను విప్పి లెక్కించగా మొత్తం రూ.25,10,105 ఆదాయం లభించినట్లు తెలిపారు.ఇందులో నోట్ల రూపంలో రూ.23,12,442,నాణేల రూపంలో రూ.1,97,663 వచ్చాయని పేర్కొన్నారు. అదనంగా హుండీలో 28 గ్రాములు 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 1 కిలో 330 గ్రాముల మిశ్రమ వెండి లభించాయని తెలిపారు.హుండీలలో వచ్చిన విదేశీ కరెన్సీ నోట్లను తిరిగి హుండీలోనే సమర్పించినట్లు వివరించారు.హుండీ లెక్కింపు అనంతరం భజన మండలి మహిళా భక్తులు స్వామివారికి భక్తి గీతాలు పాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ కార్యక్రమం భక్తి భావంతో కొనసాగింది.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకులు శ్రీమతి ఎం. అనిల్ కుమార్,పరకాల డివిజన్ ఆలయ ఈవో ఎస్. మహేష్, గ్రామ సర్పంచ్ సావటి మొగిలి, గ్రామ వీఆర్వో పి.రవీందర్,గ్రామ పెద్దలు కె. సంపత్ రావు,పి. రామరావు,డి. శ్యామ్ రావు, డి. కోటేశ్వరరావు, పబ్బ సమయ్య, పి. ఓదెలు, కె. జోగేందర్, పి. రవీందర్, పోలీసులు, కొడవటంచ భజన బృందం, నిమ్మల రాజు భజన బృందం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.జాతర సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయానికి విశేష ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *