రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే
గొడ్డు ఏడ్చిన ఏ దొడ్డి బాగుపడలే
రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఏస్ రెడ్యానాయక్
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డోర్నకల్ మాజీ ఏమ్మెల్యే రెడ్యానాయక్,రైతుల పరిస్థితులను అడిగి తెలుసుకుని అనంతరం సమావేశంలో మాట్లాడుతూ . “గొడ్డు ఏడ్చిన ఏ దొడ్డి బాగుపడలే… రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే” అని వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు,మండుతున్న ఎండలో రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చి 30 రోజులు గడిచినా తూకాలు వేయకపోవడం, అరకొరగా కొనుగోలు చేయడం, తాలు పేరుతో క్వింటాకు 3నుండి 5 కిలోల వరకు కోత విధించడం ద్వారా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ యంత్రాల లోపాలు, సిబ్బంది కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని పేర్కొన్నారు.అధికారులను నిలదీస్తూ తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తాలుతూకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రైతులకు తాగునీరు, నీడ, విశ్రాంతి కోసం షెడ్లు,సదుపాయాలు వంటి కనీస సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా సమయానికి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని, మధ్యవర్తుల జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే ఈ రైతుల సమస్యలు గానీ పట్టించుకోవడం లేదని, రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకోవడం తప్ప రైతుల కోసం ఎప్పుడూ పోరాడలేదని తీవ్రంగా విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు,రైతుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రైతులతో కలిసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, రామడుగు అచ్యుతరావు,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,మాజీ జెడ్పిటిసి శారద రవీందర్, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల వెంకటేశ్వర్లు, సర్పంచ్ కాలు నాయక్,మాజీ ఎంపీటీసీ కొమ్ము నరేష్,మాజీ సర్పంచ్ గుడిపూడి శ్రీనివాసరావు, ఎడెల్లి పరుశురాములు, గంట్ల మహిపాల్ రెడ్డి,పట్టాభి, గోల్కొండ వెంకన్న, బీఆర్ స్ పార్టీ శ్రేణులు, గంట్ల సుధాకర్ రెడ్డి,గంట్ల నాగమణి,బోడ భాస్కర్,సత్యవతి యుగంధర్,బాసిపంగు పరశురాములు,జాటోతు బాలాజీ,బోడ రెడ్డి,వస్రం,అజ్మీర హరినాయక్,మంగపతి రావు,వల్లూరి చెన్నారెడ్డి,లతీఫ్,మక్సూర్,
హుస్సేన్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.