దేశభక్తి చాటిన పెన్షనర్లు
దేశభక్తి చాటిన పెన్షనర్లు

దేశభక్తి చాటిన పెన్షనర్లు

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జయ ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంజీవరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. దేవరాజు, కోశాధికారిగా జి. షేక్ హుస్సేన్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈకార్యక్రమంలో ఎం. రామాంజనేయులు, డి. బాబా ఫక్రుద్దీన్, ఎం. చలపతి, ఖుర్షీద్, శ్రీరాములు తదితరులతో పాటు సుమారు 40 మంది పెన్షనర్లు పాల్గొన్నారు.అదేవిధంగా పెన్షనర్ల భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందజేశారు. పెన్షనర్ల భవనం అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేశభక్తి, ఐక్యతా భావంతో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.