సమాచార హక్కు చట్టం పర్యవేక్షణ సేవా సమితి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రపంచ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు
కలం ఒక ఆయుధం… గళం ఒక అపార శక్తి. ఈ రెండింటి సమన్వయంతో సత్యాన్ని నిర్భయంగా వెలికితీసి సమాజానికి చేరవేసే మహోన్నత బాధ్యత పాత్రికేయులది.భావాలను పదునుగా అల్లుతూ, ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిజాన్ని ప్రజల ముందుంచే ధైర్యమే జర్నలిజం అసలైన స్పూర్తి.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, స్వార్థం తెలియకుండా, తాను–మనము–జాతి అనే భేదాలు లేకుండా అహర్నిశలు కష్టపడే వారే నిజమైన పాత్రికేయులు.“నిజమే నా శ్వాస… నా బలం… నా ఆలోచన… నా ధైర్యం” అనే నిబద్ధతతో ముందుకు సాగే ప్రతి జర్నలిస్టు సమాజానికి ఒక దీపస్తంభం.“ఎడారి ప్రదేశంలో ఆముదపు చెట్టే మహావృక్షం” అన్నట్లుగా, అంధకారంలో వెలుగునిచ్చే దీపంలా నిజాన్ని నిలబెట్టేవారే పాత్రికేయులు. చీకటిలో కూడా క్రాంతి వెలిగిస్తూ, ప్రతి అన్యాయంపై ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యానికి కవచంలా నిలుస్తారు.“కలం పట్టి రాయరా… నిర్భయంగా చూపరా…” అన్న స్పూర్తితో, ఎవరు చెప్పలేని నిజాలను వెలికితీసి ప్రజల ముందుంచే బాధ్యత వారిదే. ఆలోచింపజేసే పదాలు, చైతన్యాన్ని రగిలించే వాక్యాలు, సమాజాన్ని మేల్కొలిపే సందేశాలే వారి అసలైన ఆయుధాలు.నిజం కోసం ఆరాటపడే మనసు, న్యాయం కోసం నిలబడే ధైర్యం, సమాజం కోసం అంకితభావం-ఇవన్నీ కలిసినప్పుడే ఒక నిజమైన జర్నలిస్టు రూపుదిద్దుకుంటాడు.
సత్యానికి సాక్ష్యంగా, ప్రజల గళంగా, సమాజానికి మార్గదర్శిగా నిలుస్తున్న ప్రతి పాత్రికేయ మిత్రుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు.