ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల పతాకావిష్కరణ
ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల పతాకావిష్కరణ

ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల పతాకావిష్కరణ

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేగొండ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు,ప్రజాసంఘాల ప్రాంగణాల్లో శుక్రవారం జాతీయ పతాకావిష్కరణ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.అధికారులు,ప్రజాప్రతినిధులు,సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్వేతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,ప్రజలకు పారదర్శకమైన సేవలందించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్సై సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని,నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు జాతీయ జెండాను ఎగురవేసి,గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.వెలుగు మండల సమాఖ్య భవనంలో ఏపీఎం ప్రేమ్‌రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహిళా సాధికారత,సంఘాల బలోపేతంపై ప్రసంగించారు.స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) కార్యాలయంలో చైర్మన్ నడిపెల్లి విజన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి,రైతు సంక్షేమానికి సొసైటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.