ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి
స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ నివాళి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ విజయ నేతృత్వంలో ఉపాధ్యాయినీలు,విద్యార్థినులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు, అందించిన సిద్ధాంతాలు అమూల్యమైనవని కొనియాడారు.విద్యార్థులు ఆయన ఆదర్శాలను,సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.అనంతరం పాఠశాల సిబ్బంది,విద్యార్థినులు జయశంకర్ సార్ చిత్రపటానికి గౌరవ వందనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు,సిబ్బంది,విద్యార్థినులు పాల్గొన్నారు.