నీటి ఆదా పద్ధతులు, సేంద్రియ పద్ధతులు
వేంసూరు,ఏప్రియల్27(తెలుగు గళం) న్యూస్:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ వారి సమన్వయం తో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 27-04-2026 నుండి 23-05-2026 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వి.వెంకటాపురం గ్రామంలో సోమవారం నాడు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట శాస్త్రవేత్తలు డా. ఎ. శ్రీజన్ మరియు డా. శ్రవన్ రైతులకు మోతాదుకు మించి యూరియా వాడకాన్ని నివారించడం, పురుగు మందుల మోతాదుకు మించి వాడకాన్ని నివారించడం, పంట మార్పిడి, మార్కెట్ డిమాండ్ ఆధారంగా వరి రకాల, సాగు నీటి వినియోగాన్ని తగ్గించడానికి నీటి ఆదా పద్ధతులు, సేంద్రియ పద్ధతులు మొదలైన వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని గౌరవనీయ సర్పంచ్ శ్రీమతి సాధు లక్ష్మి, ఉపసర్పంచ్ పాల గంగాధర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి పచ్చల రామ్మోహన్ అధ్యక్షత వహించి ప్రభుత్వ పథకాల గురించి రైతులకు వివరించారు. వీరితో పాటు మండల పశువైద్యాధికారి రాజశేఖర్ సబ్సిడీలో అందుబాటులో ఉన్న పశుగ్రాస జొన్న విత్తనాల గురించి వివరించారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.