
ఈ69న్యూస్ జనగామ
జనగామ పట్టణ కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు కలెక్టర్ కు సిపిఎం జనగామ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తూ మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం జనగామ పట్టణ కమిటీ ప్రతినిధి బృందం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పట్టణ కమిటీ సభ్యులు బొట్ల శ్రావణ్ పాము శ్రీకాంత్ లు మాట్లాడుతూ..జనగామ పట్టణ కేంద్రంలోని నెహ్రు పార్క్ రోడ్డుకు గల మోర్ సూపర్ మార్కెట్ పై చర్యలు తీసుకొని నాణ్యమైన మేలిమైనా తిను బండారాలు ఆహార పదార్థాలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా వారి దృష్టికి మొన్న 25వ తేదీన జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన బండారు లక్ష్మణ్ అనే రైతు వారి పిల్లలకు పోషక పదార్థాలు బలమైన ఆహార పదార్థాలు ఉండే డ్రై ఫ్రూట్స్ నట్స్ తో తయారైన యోగా బార్ అనే ప్యాకింగ్ ఫుడ్ ను తీసుకుపోయి వారి పిల్లలకు తినిపించగా వారు అస్వస్థతకు గురి అయ్యారని నిన్న వచ్చి సూపర్ మార్కెట్ సిబ్బందిని నిలదీయడం జరిగిందని వారు పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారన్నారు.సూపర్ మార్కెట్లో విక్రయించిన పిల్లలు తినే ఆహార పదార్థానికి మార్చి19 వరకే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అయినా వినియోగదారులకు అమ్మడం వల్ల అవి వినియోగించి వాడుకున్న ప్రజలు పిల్లలు ఆరోగ్యాలు దెబ్బ తినే ప్రమాదాలు ఉన్నాయని తెలిపారు.అలాగే గతంలో 25 రోజుల క్రితం జనగామ పట్టణంలోని బీరప్పగడ్డకు చెందిన ఉపేందర్ అనే వినియోగదారుడు వారి పిల్లల కోసం తీసుకుపోయిన ప్యాకింగ్ ఫుడ్ లో ఫంగస్ వచ్చి కూల్లిపోయి ఉన్నదని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే మోర్ సూపర్ మార్కెట్ వారిని మందలించి అపరాధ రుసుము కూడా వేశారని తెలిపారు.అయినా వారి తీరు మార్చుకోక లాభావేక్షతో కాలం చెల్లిన వస్తువులను తినుబండారాలను అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు.పట్టణంలోని అన్ని సూపర్ మార్కెట్లను హోటళ్లను బిర్యాని సెంటర్లను తనిఖీలు నిర్వహించాలని కోరారు.ఈవిషయమై వారు స్పందించి ఫుడ్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ అధికారులతో సంయుక్తంగా సూపర్ మార్కెట్లోని అన్ని రకాల వస్తువులను తనిఖీ నిర్వహించి కాలపరిమితి ఉన్నవాటిని మాత్రమే అనుమతించి కాల పరిమితి చెల్లిని వాటిని తొలగిస్తామని తనిఖీ పూర్తి అయిపోయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు.