రైతు ముంగిట్లో కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలురైతు ముంగిట్లో కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 May, 2026E69NEWS

రైతు ముంగిట్లో కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు

రైతు ముంగిట్లో కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు డాక్టర్. సి.హెచ్. రాములు.
వ్యవసాయ అదికారి ప్రశాంత్, ఏఈవో రాకేష్ పంట మార్పిడి పాటించండి -నేల ఆరోగ్యాన్ని కాపాడండి
•తక్కువ యూరియా వాడండి -పంట మార్పిడితో వివిధ పంటలలో అధిక దిగుబడి సాధించండి వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలో శనివారం చింత నెక్కొండ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు డాక్టర్.సి.హెచ్. రాములు. వ్యవసాయ అదికారి ప్రశాంత్,ఏఈవో రాకేష్ ఇందులో రైతులకు గ్రామ పంచాయితీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్. సి.హెచ్. రాములు మాట్లాడుతూ ప్రధానంగా తక్కువ యూరియా వాడకం మీద అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకం అంటే ఉదాహరణకు వరి పంటలో కేవలం 100 కిలోలు యూరియా 50 కిలోల డిఏపి మరియు 25 కిలోల పోటాష్ వాడుకోవాలని సూచించారు తద్వారా సాగు ఖర్చును తగ్గించుకొని నేల,నీరు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు అని సూచించారు. అవసరం మేరకు రసాయనాలను వాడుకోవాలి అంటే ఎరువులు, గడ్డి మందులు, పురుగుమందులు,తెగులు మందులు, సిఫారసు మేరకు మాత్రమే వాడాలని తద్వారా నేల నీరు మరియు వాతావరణ కాలుష్యమును తగ్గించుకోవచ్చు అని సూచించారు. అదేవిధంగా సాగునీటిని ఆదా చేయడం ద్వారా నీటి నిలువలను కాపాడాలని తద్వారా రాబోయే తరాలకు మంచి నీటి వనరులను మంచి చెరువులను మంచి నీటి సదుపాయాన్ని అవసరాలు నెరవేరే విధంగా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా పంట మార్పిడి అవసరం గురించి తెలియజేశారు ఈ వివిధ పంటలలో అధిక దిగుబడి సాధించడానికి పంట మార్పిడి ఏ రకంగా సహాయపడుతుంది అదేవిధంగా నేలసారం వృద్ధి అవుతుంది అని వివిధ పంటలలో ఉదాహరణగా సూచించారు వరికి ముందు పచ్చి రొట్ట పంటలు వేసుకోవడం వరి తర్వాత పెసర్లు, బబ్బిర్లు,మినుములు గాని వేసుకోవడం ద్వారా పప్పు దినుసులు అవసరాలు నెరవేరుతుంది. ఈ పంటలను నేలలో కలియ దున్నడం ద్వారా నేలా ఆరోగ్యం మెరుగవుతుంది తద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు అని తెలియజేశారు అదేవిధంగా చెట్లను పెంచడం వలన వాతావరణ, నేల మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించుకొని సుస్థిర ఆదాయాన్ని పొందడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్,కిషన్ నాయక్ , శాస్త్రవేత్తలు డాక్టర్. సి.హెచ్. రాములు. వ్యవసాయ అదికారి ప్రశాంత్, ఏఈవో రాకేష్ వ్యవసాయ విద్యార్థులు అరవింద్ మరియు కావేరి మరియు రైతులు పాల్గొని విజయవంతం చేశారు.ఈసమావేశంలో గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ విధమైనటువంటి కార్యక్రమాలను ముందు ముందు కూడా జరపాలని అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని సీజన్ స్టార్ట్ అయినంక అంటే జూన్ మాసంలో రైతులకు అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించినవిగా ఇట్లాంటి కార్యక్రమాలను మునుముందు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం గురించి కూడా రైతులు ఆసక్తిగా వారి వారి సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగిందన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *