సీజనల్ వ్యాధులు ప్రభలక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలిసీజనల్ వ్యాధులు ప్రభలక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

సీజనల్ వ్యాధులు ప్రభలక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలి

సీజనల్ వ్యాధులు ప్రభలక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలి

శేరిపురం క్రాస్ రోడ్డు నుండి కొండలమ్మ దేవాలయం వరకు కంకర పోసి ఉన్న రోడ్డుపై తారు ను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామం లో యం.వెంకట్ అధ్యక్షతన సోమవారం జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కంకర పోసిన రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే ఈ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డుపై నిత్యం ఇల్లందు, మానుకోట ప్రాంతాలకు అనేకమంది వెళుతుంటారని, వర్షాకాలం సీజన్ రావడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనేకసార్లు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఈ రోడ్డు నిర్మాణం నేటి పూర్తి కాకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామంలో స్మశాన వాటికకు విద్యుత్ సౌకర్యం లేదని ఇటీవల గ్రామ సభలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారని వర్షాల నేపథ్యంలో వెంటనే లైటింగ్ సౌకర్యం కల్పించాలని, పంచాయతీ మొత్తానికి రెగ్యులర్ ఆశ వర్కర్ లేకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రెగ్యులర్ ఆశ వర్కర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు వి.పి వెంకటేశ్వర్లు, ఎం నాగమణి, సిహెచ్ ఎల్లయ్య, సిహెచ్ మౌనిక, శాఖ కార్యదర్శి వి కొండయ్య,సభ్యులు జి సీతారాం, వి. వీరభద్రం,వి పద్మ, బి. ఝాన్సీ, బి. నరేష్, తదితరులు ఉన్నారు*

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *