ఆర్.ఎస్. ఘన్‌పూర్ ప్రాజెక్టును పరిశీలించిన గోదావరి బోర్డు అధికారుల బృందంఆర్.ఎస్. ఘన్‌పూర్ ప్రాజెక్టును పరిశీలించిన గోదావరి బోర్డు అధికారుల బృందం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

ఆర్.ఎస్. ఘన్‌పూర్ ప్రాజెక్టును పరిశీలించిన గోదావరి బోర్డు అధికారుల బృందం

ఆర్.ఎస్. ఘన్‌పూర్ ప్రాజెక్టును పరిశీలించిన గోదావరి బోర్డు అధికారుల బృందం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పి. డోయ్ గ్యాంబా ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం సోమవారం ఆర్.ఎస్. ఘన్‌పూర్ రిజర్వాయర్‌తో పాటు పంప్‌హౌస్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించింది.ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, పంప్‌హౌస్ పనితీరు, సాగునీటి సరఫరా విధానం, ప్రాజెక్టు నిర్వహణ తీరును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నీటి వినియోగం, నిర్వహణ, సాంకేతిక అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రాజెక్టు పనులు సమర్థవంతంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.సాగునీటి పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్వహణ ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించినట్లు సమాచారం.ఈ తనిఖీలో ఇరిగేషన్ శాఖ ప్రధాన ఇంజనీర్ ఆర్. సుధీర్, పర్యవేక్షణ ఇంజనీర్ బి. సీతారామ్ నాయక్, ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ బి. సంపత్ కుమార్, సహాయ ఇంజనీర్లు సారా, వినోద్, సాయి తేజస్వినితో పాటు ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.గోదావరి బోర్డు అధికారుల ఈ పర్యటనతో ప్రాజెక్టు నిర్వహణ, సాగునీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించబడిందని అధికారులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *