తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 వసంతాలు పూర్తయినప్పటికీ పేదలు,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీఅణగారిన వర్గాలకు పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం అందాల్సి ఉందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు సమానంగా అందేలా పాలకులు కృషి చేయాలన్నారు.రాజ్యాంగ హక్కుల పరిరక్షణ,సామాజిక న్యాయ సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా,మండల స్థాయి నాయకులు,కార్యకర్తలు,యువత,స్థానికులు పాల్గొన్నారు.