సీపీఎం సర్వే లో వెల్లడైన పలు సమస్యలు"సీపీఎం సర్వే లో వెల్లడైన పలు సమస్యలు"
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ19 August, 2026E69NEWS

వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయండి మహాప్రభో”

సీపీఎం సర్వే లో వెల్లడైన పలు సమస్యలు"

సీపీఎం సర్వే లో వెల్లడైన పలు సమస్యలు”

సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు18(తెలుగు గళం) న్యూస్: నియోజక వర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు,లాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కమిటి సభ్యులు మోరంపూడి పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చేసిన సర్వేలో వెల్లడైందని పాండు మీడియాకు తెలిపారు.
శానిటేషన్ పోస్టులు 03 గుర్రుకు కేవలం ఒకరే ఉన్నారనీ మరొకరిని డిప్యూటేషన్ పై పంపారని తెలిపారు.ఏం.ఎల్.హెచ్.పి.(పల్లె దవాఖాన వైద్యులు) 07 గురుకు 04 గురు మాత్రమే ఉన్నారని(అడసర్లపాడు,చౌడవరం,కేజీ మల్లెల),మొదటి శ్రేణి ఏ.ఎన్.ఏం లు 09 మందికి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు.ఈ సర్వే లో సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్రావు,నాయుకులు మల్లూరు చంద్రశేఖర్,డంకర శ్రీను,కావూరి భగత్ సింగ్ లు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *