ఇవి వాహనాలను వినియోగించండి పర్యావరణాన్ని రక్షించండి.ఇవి వాహనాలను వినియోగించండి పర్యావరణాన్ని రక్షించండి.
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

ఇవి వాహనాలను వినియోగించండి పర్యావరణాన్ని రక్షించండి.

ఇవి వాహనాలను వినియోగించండి పర్యావరణాన్ని రక్షించండి.

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ నాయకులు వందనపు సత్యనారాయణ పోలిశెట్టి శ్రీ శివకుమార్ పిలుపునిచ్చారు. దురిసేటి శ్రీనివాసరావు, అనురాధ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఇవి వాహనాల షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణ పొల్యూషన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా తగ్గించే అవకాశం ఉందన్నారు. దురిసేటి శ్రీనివాసరావు, మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి బైక్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్నదని, మారుతున్న కాలానికి అనుగుణంగా తన వంతు కర్తవ్యం గా కొంతమేరకైనా పొల్యూషన్ తగ్గించాలని ఇవి బైక్ షోరూంను ప్రారంభించామని అన్నారు. ప్రజలందరి సహకారంతో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తానన్నారు. తలశిల వెంకట సుబ్రహ్మణ్యం, హరి సాయి, శ్రీ పూజిత ,రాము, చెన్నారావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *