ఒకే కేసులో సీఐ,ఎస్సై సస్పెన్షన్ఒకే కేసులో సీఐ,ఎస్సై సస్పెన్షన్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

ఒకే కేసులో సీఐ,ఎస్సై సస్పెన్షన్

ఒకే కేసులో సీఐ,ఎస్సై సస్పెన్షన్

జనగామ జిల్లా పోలీసు శాఖలో ఒకే కేసుకు సంబంధించి ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అబ్బయ్యతో పాటు ప్రస్తుతం ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)కు అటాచ్‌గా ఉన్న ఎస్సై షేక్ హమీద్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సమాచారం మేరకు, షేక్ హమీద్ బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నమోదైన ఓ కేసు వ్యవహారంలో సీఐ, ఎస్సైలు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, విచారణ నివేదిక ఆధారంగా కమిషనర్ ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.ప్రస్తుతం ఏఆర్‌కు అటాచ్‌లో ఉన్న ఎస్సై షేక్ హమీద్‌తో పాటు నర్మెట సీఐ అబ్బయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకే కేసులో ఇద్దరు అధికారులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే, పోచన్నపేట గ్రామానికి చెందిన ఒక కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే సస్పెన్షన్‌కు దారితీసిన ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *