గర్భిణీలకు ఉచిత ఆటో సేవ
BREAKING NEWS
గర్భిణీలకు ఉచిత ఆటో సేవ
:వైరా మండలం సిరిపురం కేజీ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ఆటో సేవ అందిస్తూ లతీఫ్ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సోమవారం నారపనేనిపల్లి గ్రామానికి చెందిన గుడిదే అరుణ అనే గర్భిణీ స్త్రీని వైద్య పరీక్షల కోసం వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి, పరీక్షల అనంతరం సురక్షితంగా తిరిగి ఆమె ఇంటి వద్దకు చేర్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు ఆసుపత్రులకు చేరుకోవడంలో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన గర్భిణీలు ఈ ఉచిత సేవను వినియోగించుకోవాలని సూచించారు.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9603747878