mahabubabad news telugu news telugu varthalu local news e69news helth bullten toadyజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి

మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-

మానుకోట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న రోజులలో ఎండల తీవ్రత 44 డిగ్రీల పైకి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుపుతూ మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలకు హీట్ వేవ్ ఫై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్లను ఏర్పాటు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కార్మికుల పట్ల శ్రద్ధ వహించి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజులలో 18 సంవత్సరాల లోపు వయసున్న వారికి 18 కిలోల బరువు తక్కువగా ఉంటే బీసీజీ వ్యాక్సిన్ వేయవలసిన ఆవశ్యకత ఉందని దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు న్యూట్రిషనల్ రిహాబిటేషన్ సెంటర్ కు కావలసిన ఏర్పాట్లను చేయాలని, ప్రతి నెలలో జరిగే మీటింగ్లకు ఆశాలు, ప్రోగ్రాం అధికారులు విధిగా హాజరై తమకు సంబంధించిన కార్యక్రమాల అమలుపై విశ్లేషించి, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.మానసిక ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఉప కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి, జిల్లా జనరల్ హాస్పిటల్ లోని సైకియాట్రిస్ట్ డాక్టర్ వద్దకు రిఫర్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ కాన్పుల శాతం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తపరుస్తూ తల్లుల సమావేశంలో నార్మల్ డెలివరీ పై అవగాహన కల్పించాలని, దానికి తగినట్లుగా గర్భిణిగా ఉన్నప్పుడు యోగా నేర్పించాలని ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చిన స్త్రీల యొక్క ఇంటిలోని పెద్దవారికి నార్మల్ డెలివరి వల్ల కలిగే ప్రయోజనాల పైన అవగాహన కలిపించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే మందులను ఉపయోగించుకునేలా చూడాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ వో లు డాక్టర్ అంబరీష,, డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శ్రవణ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News