ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యకు ఎంపికైన సంజన

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సింగిశాల సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చాటింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదివిన సంజన 548 మార్కులతో ఉత్తీర్ణత సాధించి మహబూబ్నగర్ సమగ్ర విద్యా సంస్థలో సీటు సాధించింది.
నిరుపేద కుటుంబంలో జన్మించిన సంజన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువులో ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగ రంగాల్లో మరింత రాణించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.ఎస్.రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి కిన్నెర వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు.
రామచంద్రరావు బంజర్ గ్రామ సీనియర్ నాయకులు యలమర్తి శ్రీను, వాసం వంశీకృష్ణ, పెనుబల్లి మండల ఉద్యమకారులు తడికమళ్ల చిరంజీవి, కాకాటి ప్రకాష్, మరకాల రమేష్, మరకాల శాంతకుమారి, పాపట్ల నవీన్ తదితరులు సంజనను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు.