ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కడియం కావ్య
వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కడియం కావ్య
తెలుగు గళం న్యూస్ హన్మకొండ మే03
హన్మకొండ:వడ్డేపల్లి 60వ డివిజన్లో రూ.1.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. కడియం కావ్య మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వడ్డేపల్లిలో ఈ కేంద్రం ప్రారంభం కావడం వల్ల స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తల్లి-శిశు సంరక్షణ, టీకాలు, నిర్ధారణ పరీక్షలు వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు.ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి వార్డులో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తోందని, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కేంద్రంలోని సేవలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్,డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.