మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణిమరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

ఈనెల 11 నుంచి ఇండ్ల గణన

మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి మరిపెడ మండల వ్యాప్తంగా ఇండ్ల గణన సర్వే చేపట్టనున్నట్లు తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. మండలాన్ని మొత్తం 158 బ్లాకులుగా విభజించి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 87 మంది ఎన్యూమరేటర్లు (ఉపాధ్యాయులు), 14 మంది సూపర్వైజర్లు పాల్గొని గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు చెప్పారు. సర్వే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ సర్వే ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగానున్నట్లు తెలిపారు. ఇండ్ల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.
కచ్చితత్వంతో నిర్వహించేందుకు అధికారులకు ఇప్పటికే అవసరమైన సూచనలు జారీ చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *