రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు
ఘనంగా జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణి శ్రీనివాస్ జన్మదినం వేడుకలు
రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు
తెలుగు గళం న్యూస్ జనగామ మే 03
జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ 42వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అలాగే మున్సిపల్ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా సన్మానం చేశారు.అదే విధంగా గిర్నిగడ్డలోని వృద్ధా అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అక్కడి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు.అనంతరం మధ్యాహ్నం పట్టణంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో ఆత్మీయ మిత్రుల మధ్య జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మూడవ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి గోపి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనగామ పట్టణ అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఇంకా ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు, కాంగ్రెస్ జనగామ జిల్లా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మేడే శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ నాయకులు మిద్దెపాక స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు