
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో,వరంగల్ పోలీస్ కమీషనర్ సంప్రీత్ సింగ్ ఐపిఎస్,మరియు ఎసిపి టి.సత్యనారాయణ పర్యవేక్షణలో డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన(23) మంది వ్యక్తులను,మేజిస్ట్రేట్ అబ్బోజు.వేంకటేశం ఎదుట హాజరు పరచగా,ఆర్1 మంతుర్తి కుమారస్వామి తండ్రి పేరు భిక్షపతి,వయసు 35,వృత్తి.లారీ డ్రైవర్ గ్రామం పర్వతగిరి,వరంగల్ కు 2000/-జరిమానా మరియు(3)రోజుల జైలు శిక్ష పడగా పరకాల సబ్ జైలు కు పంపి,మిగత(22) మంది వ్యక్తులకు 26,500/-రూపాయల జరిమానా విధించారు.మరియు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిన (01) పొడిశెట్టి లక్ష్మణ్ తండ్రి పేరు సోమయ్య,వయసు.20 వృత్తి.లారీ డ్రైవర్ గ్రామం ఆకునూర్,సైదాపూర్,కరీంనగర్ ను కోర్టులో హాజరు పర్చగా వారికి 500/-రూపాయల జరిమానా మరియు(3)రోజుల జైల్ శిక్ష పడగా పరకాల సబ్ జైలు కు పంపడం జరిగిందని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ మీడియాకు వెల్లడించారు.