E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
నేటి నుండి గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు

ఈ నెల 18, 19 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు పిలుపునిచ్చారు. పెనుబల్లిలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో నంబర్ 51ను సవరించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రామారావు, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
