పెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండిపెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

పెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండి

పెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండి

మాకు మధ్యాహ్న భోజనం వద్దు,ఫిఆర్సీ ఏ ముద్దు

పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని రాష్ట్ర క్యాబినెట్లో సమావేశంలో నిర్ణయించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించాలని కోరారని వారు ప్రశ్నించారు.ఉపాధ్యాయులకు కావాల్సింది,పాఠశాలలకు మౌళిక సదుపాయాలు మరియు పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది మరియు పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు, మూడు సంవత్సరాల క్రితం అమలు చేయవలసిన పిఆర్సీని తక్షణమే అమలును కోరుకుంటున్నారని,వాటిని పక్కనబెట్టి ఎవరూ కోరని విధంగా మధ్యాహ్న భోజనం ఇవ్వాలని ఆలోచన అశాస్త్రీయం మరియు అర్థ రహితం అని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ డిఎల మంజూరు మరియు పిఆర్సీ లను ప్రకటించి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *